బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు రానున్న థాయ్ ఎయిర్‌లైన్స్ 3జీ 329 విమానంలో టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోనే నిలిపివేసిన అధికారులు, విమానంలో ఉన్న ప్రయాణికులను దించివేశారు. ప్రస్తుతం వారు అక్కడే ఎదురుచూస్తున్నారు.
విమానంలో వచ్చిన టెక్నికల్ ఎర్రర్‌ను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్య కారణంగా విమానం ఆలస్యంగా బయలుదేరే అవకాశం ఉందని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ముందస్తుగా తెలియజేశారు. తాజా సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విమానం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన నాలుగు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానాల్లోనూ ఈ తరహా ఘటనలు నమోదయ్యాయి.
నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని తిరిగి వెనక్కి మళ్లించి ప్రయాణికులను ఇతర విమానాల్లో తరలించారు.
ఇక కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 270 మంది ప్రాణాలు కోల్పోవడంతో విమానాల భద్రతపై పెరుగుతున్న అనుమానాలు, ఆందోళనలు కొత్త కాకపోయినా, ఈ మధ్య కాలంలో సాంకేతిక సమస్యల కారణంగా విమానాల రద్దు, అత్యవసర ల్యాండింగ్‌లు ఎక్కువవుతున్నాయి. కేవలం 48 గంటల్లో తొమ్మిది ఎయిరిండియా విమానాల్లో టెక్నికల్ ఎర్రర్స్ నమోదైనట్లు సమాచారం.
ఈ పరిణామాలు ప్రయాణికుల నమ్మకాన్ని దిగజార్చేలా ఉండటమే కాకుండా, విమానయాన సంస్థలు భద్రతపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని తేలుస్తున్నాయి.
Read More : బనకచర్లపై సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఘాటు విమర్శలు.

One thought on “బ్యాంకాక్-హైదరాబాద్ విమానానికి సాంకేతిక అంతరాయం…”
Comments are closed.