ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసుపై : ఆది శ్రీనివాస్

ఫార్ములా ఇ రేస్ కేసులో ఏసీబీ నోటీసు అందిన వెంటనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంకోచించారని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ కేసులో ఇప్పటికే అవినీతి నిర్ధారణకు అనేక ఆధారాలు ఉన్నాయని, కానీ విచారణ ఎదుర్కోవడానికి బదులు కేటీఆర్ బడాయి మాటలు మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరించి నిజాన్ని బయటపెట్టాలని కేటీఆర్‌కు సూచించారు. ఇది కేవలం ఫార్ములా ఈ రేస్ కేసమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోనూ కేటీఆర్ పాత్రపై అనేక ఆరోపణలు ఉన్నాయని ఆది శ్రీనివాస్ చెప్పారు. నిజాయితీ ఉంటే నార్కో టెస్ట్‌కు కూడా సిద్ధమయ్యే ధైర్యం చూపాలని సవాల్ విసిరారు.

ప్రజల ఆస్తిని లూటీ చేసినవారు ఎంతకాలం నిశ్చింతగా ఉండలేరని, ఎవరైనా చట్టం ముందు తల వంచక తప్పదని ప్రభుత్వ విప్ హెచ్చరించారు. అన్ని అక్రమాల మీద పూర్తి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ఆయన అన్నారు.

Read More : కాజిపల్లిలో దుర్ఘటన.. టిప్పర్‌లో అగ్ని ప్రమాదం