మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన.

mahesh goud bomma

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో లేదా జూన్ తొలి వారంలో జరిగే అవకాశముందని తెలిపారు. వివిధ రాజకీయ సమీకరణాల వల్ల విస్తరణలో కొంత జాప్యం ఏర్పడిందని వెల్లడించారు. అయితే తమ ప్రభుత్వంలోని మంత్రులందరూ ఐక్యంగా పని చేస్తున్నారని, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా చూపించారని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. “సైబర్ క్రైమ్‌ ద్వారా కేసులు నమోదు చేస్తాం. మధ్యప్రదేశ్ ప్రభుత్వ విధానాలను తెలంగాణలోనూ అమలు చేస్తాం” అని స్పష్టం చేశారు.

టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఈ నెల 26 లేదా 27న నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. సీఎం మార్పు గురించి విపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు ఆనిచెప్పారు. బీఆర్ఎస్‌లో తానే తానుగా విభేదాలు పొడచూపుతున్నాయని, అక్కడ మూడు ముక్కలాట నడుస్తోందని గౌడ్ ఆరోపించారు.

మహిళా కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన సాధారణ అంశమేనని, మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌరవం మరే పార్టీలో లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Read More : హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు

One thought on “మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన.

Comments are closed.