హైదరాబాద్ పోలీసులు మాదకద్రవ్యాల నియంత్రణలో ప్రపంచ స్థాయిలో నెంబర్ వన్ అవార్డు గెలుచుకున్న విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కృషిలో భాగంగా తెలంగాణ పోలీస్ ప్రపంచ వ్యాప్తంగా 138 దేశాలతో పోటీ పడిన ఈ అవార్డును సాధించడం గర్వకారణమని తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ, “వివిధ రంగాల్లో తెలంగాణను ప్రపంచానికి రోల్ మోడల్ గా నిలబెట్టాలని నా కల. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలో తొలిస్థానంలో నిలిచిన విషయం గర్వంగా ఉంది. హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్ గారికి, ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు నేను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను” అన్నారు.
దుబాయ్‌లోని పోలీస్ ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో ‘ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్’ అవార్డును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అందుకున్నారు. ఈ అవార్డుకు 138 దేశాల పోలీసులు పోటీ పడ్డారు. చివరకు హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం, అవగాహన కార్యక్రమాలు, బాధితుల పునరావాసం వంటి రంగాల్లో హైదరాబాద్ పోలీసులు తీసుకున్న బాధ్యతకు ఈ అవార్డు ప్రతీకాత్మకం.
Read More : ఎన్నికల సమయంలోనే కాదు, – కిషన్‌రెడ్డి

One thought on “హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు”
Comments are closed.