కర్ణాటక సీఎం పదవి పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సంబంధించి రాజకీయ చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశించడంలో తప్పేం లేదని, కానీ తాము పార్టీ క్రమశిక్షణకు పూర్తిగా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివాచార్య స్వామితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్… 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తన పాత్రను గుర్తు చేస్తూ, పీఠాధిపతి ఆయనకు ముఖ్యమంత్రి పదవి రావాలని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన డీకే… “ప్రజలు, మఠాధిపతులు, కార్యకర్తల అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. కానీ పార్టీ నిర్ణయమే నాకు ముఖ్యమైందని” చెప్పారు. తాము క్రమశిక్షణతో కూడిన కాంగ్రెస్ సైనికులమని, పార్టీకి కట్టుబడి పని చేస్తామని స్పష్టం చేశారు.

ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే తన ఐదేళ్ల పాలన కొనసాగుతుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి సీఎంపై రాజకీయంగా చర్చకు దారితీశాయి.

Read More : మొబైల్ రీచార్జ్ ధరలు మళ్లీ పెరుగనున్నాయా?