దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు మరోసారి మొబైల్ రీచార్జ్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. ఈ ఏడాది చివరినాటికి ప్లాన్ ధరలను సుమారుగా 10 నుంచి 12 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మాత్రం బేసిక్ ప్లాన్‌లను కాకుండా.. మధ్య, ఉన్నత శ్రేణి ప్లాన్లపైనే ధరల పెంపు ప్రభావం పడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు టెలికాం రంగ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, అధిక డేటా వినియోగం ఉన్న వినియోగదారులపైే ఈ పెంపు ప్రభావం చూపనుంది.
ఈ మేరకు ఇప్పటికే కొన్ని టెలికాం కంపెనీలు వినియోగదారుల నుంచి స్పందన కూడా సేకరిస్తున్నాయి. మొబైల్ సేవల నాణ్యతను మెరుగుపరిచే చర్యలతో పాటు, 5జీ విస్తరణ వ్యయాలను భరించేందుకు ఈ ధరల సవరణ అవసరమవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Read More : బీహార్‌లో టీచర్‌పై దాడి: విద్యార్థి తల్లిదండ్రుల ఆగ్రహం

One thought on “మొబైల్ రీచార్జ్ ధరలు మళ్లీ పెరుగనున్నాయా?”
Comments are closed.