భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కీలకంగా మారే సమాచారం ఐఎస్ఎస్ నుంచి అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండి, యాక్సియమ్-4 (Ax-4) మిషన్‌లో భాగంగా ప్రయాణిస్తున్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా, జూలై 6న ఇస్రో చైర్మన్ వి.నారాయణన్‌తో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం, మిషన్ పురోగతిపై పూర్తి వివరాలు, శాస్త్రీయ ప్రయోగాలపై సమగ్ర సమాచారం ఇచ్చినట్లు ఇస్రో వెల్లడించింది. శుక్లా చేపడుతున్న ప్రయోగాలు, పరిశోధనలు భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌కు అత్యంత ఉపయుక్తంగా ఉండనున్నాయని చైర్మన్ నారాయణన్ అన్నారు. మిషన్ పూర్తయిన తరువాత వివరమైన నివేదిక అందించాల్సిన అవసరాన్ని కూడా ఆయన స్పష్టంగా సూచించారు. ఈ సంభాషణలో ఇస్రోకి చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. శుక్లా ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో చేస్తున్న ప్రయోగాల లక్ష్యాలు, ఎదురవుతున్న సవాళ్లపై చైర్మన్‌కు వివరంగా సమాచారం అందించారు.
ఇస్రో మద్దతు ఎప్పటికీ తన వెంట ఉంటుందని నారాయణన్ హామీ ఇచ్చారు. మిషన్ ప్రారంభానికి ముందు శుక్లాకు ఇచ్చిన మార్గనిర్దేశాన్ని గుర్తుచేశారు. గగన్‌యాన్‌కు సంభందించి స్టాండ్‌బై వ్యోమగామిగా ఉన్న ప్రశాంత్ బాలన్ నాయర్‌తో కూడా ఇస్రో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతుండటం గమనార్హం.
Read More : కర్ణాటక సీఎం పదవి పై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

One thought on “ఐఎస్ఎస్ నుంచి ఇస్రోతో మాట్లాడిన వ్యోమగామి శుభాంశు శుక్లా”
Comments are closed.