ధర్మవరం విషాదంలో మునిగింది

సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కళాశాల ఫంక్షన్‌కు చీర కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ధర్మవరం బాలాజీ నగర్‌కు చెందిన ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఉష (17) తన తల్లిని కళాశాల కార్యక్రమానికి చీర కొనివ్వాలని కోరింది. అయితే, చీర కొనలేనని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More : తిరుమలలో చిరుత సంచారం

One thought on “ధర్మవరం విషాదంలో మునిగింది

Comments are closed.