ప్రకాశం జిల్లా పొదిలిలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు, మహిళలు నిరసనకు దిగారు. సాక్షి టీవీలో ప్రసారమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుని ఘర్షణకు దిగాయి.
ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు గాయపడిన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ, “పొదిలిలో మా 40,000 మంది వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు కేవలం 40 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారు. నిజంగా మా కార్యకర్తలు వారిపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఏలాగుంటుంది? దాడికి ప్రేరేపించిన టీడీపీ నాయకులే. అయినా కేసులు పెట్టింది మాత్రం రైతుల మీదే!” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసు బలగాలు మోహరించగా, దర్యాప్తు కొనసాగుతోంది.
Read More : హైదరాబాద్–తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

One thought on “పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు”
Comments are closed.