డేవిడ్ వార్నర్‌కు రాజమౌళి బాహుబలి కిరీటం గిఫ్ట్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడి, తెలుగు అభిమానులకు దగ్గరైన వార్నర్, తరచూ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో చేసిన వీడియోలతో సోషల్ మీడియాలో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా లుక్స్‌లో చేసిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు ‘బాహుబలి’ విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీని మేకర్స్ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాను ఇప్పుడు ఒకే భాగంగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా వార్నర్ తన గతంలో ధరించిన బాహుబలి వేషధారణ ఫోటోలను మరోసారి పంచుకుంటూ, “కిరీటం ఉన్న ఫోటో బాగుందా? లేక కిరీటం లేనిదా నచ్చిందా?” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ, “హాయ్ డేవిడ్.. మీరు ఇప్పుడు మహిష్మతి సామ్రాజ్యానికి నిజమైన మహారాజులా తయారవ్వండి. నేను ఈ కిరీటాన్ని మీకు పంపుతున్నాను” అని కామెంట్ చేశారు. దీనికి వార్నర్ ఆనందం వ్యక్తం చేస్తూ, “ఈ ప్రత్యేక బహుమతి కోసం ఎదురుచూస్తున్నాను” అని రిప్లై ఇచ్చారు. అదేవిధంగా ‘బాహుబలి’ టీమ్ కూడా “మీరు ఈ సినిమాను ఆస్ట్రేలియాలో మరోసారి చూడండి” అంటూ వ్యాఖ్యానించగా, వార్నర్ థంబ్ అప్ సింబల్‌తో సమాధానం ఇచ్చారు.

Read More : మరోసారి వివాదంలో నటి కల్పిక (Video)

One thought on “డేవిడ్ వార్నర్‌కు రాజమౌళి బాహుబలి కిరీటం గిఫ్ట్

Comments are closed.