పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిస్సందేహంగా అందరి మనసులు దోచుకునే వ్యక్తిత్వం కలిగివున్నాడు. సినిమాల్లో ఎంత భారీ యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంటాడో, నిజజీవితంలో కూడా అంతే సరదాగా, అతిథి మర్యాదలతో ఉండే వ్యక్తి. ఆయన ఇంటి భోజనానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడం అతిశయోక్తి కాదు. సహ నటులకు స్వయంగా ఇంటి భోజనం పంపించడం ప్రభాస్‌కు అలవాటు.
తాజాగా ‘సలార్’లో ప్రభాస్‌తో కలిసి నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్, అతని ఇంటి భోజనం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ‘ఎల్2: ఎంపురాన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ పంపిన మటన్ కర్రీ తనకు ఎంతగానో నచ్చిందని, ఆయన గెస్ట్‌లను గౌరవించే తీరును ప్రశంసించారు.
ప్రభాస్ అతిథులకు ఏ మాత్రం తేడా లేకుండా తనదైన శైలిలో విందు ఏర్పాటు చేస్తాడని, అదే అతని గొప్పతనమని చెప్పుకొచ్చారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ అభిమానులు దీనిని తెగ షేర్ చేస్తూ, ‘ఎల్2: ఎంపురాన్’ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు. ‘లూసిఫర్’ తర్వాత పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

One thought on “ప్రభాస్ ఇంటి భోజనం.. పృథ్వీరాజ్ ఫేవరెట్ డిష్ ఇదే!”
Comments are closed.