హైదరాబాద్‌లో మరోసారి దేవాలయాల కూల్చివేత వివాదం చెలరేగింది. బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయం ప్రాంగణాన్ని రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై నటి కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు. “దమ్ముంటే రోడ్డు మధ్యలో ఉన్న దర్గాలను కూల్చివేసి చూపించండి. హిందువుల జోలికి వచ్చిన వారు ఎప్పుడూ బాగుపడలేదని చరిత్ర చెబుతోంది” అంటూ ఆమె మండిపడ్డారు. కళ్యాణి ఈ చర్యను హిందూ భావాలను దెబ్బతీసే ప్రయత్నంగా అభివర్ణించారు. “దేవాలయాలపై ఈ తరహా చర్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తాయి. ఒకవైపు సాంప్రదాయాలకు గౌరవం ఇవ్వాలని చెబుతూ, మరోవైపు ఇలా చేయడం ఏ విధమైన న్యాయం?” అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై స్థానికులు కూడా నిరసన వ్యక్తం చేస్తూ, దేవాలయ ప్రాంగణాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం ఈ చర్య చట్టబద్ధంగానే చేపట్టినట్లు వివరణ ఇచ్చారు.
ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుండగా, సోషల్ మీడియాలో కరాటే కళ్యాణి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Read More : సికింద్రాబాద్‌లో స్పెర్మ్ క్లినిక్ దందా బహిర్గతం

One thought on “పెద్దమ్మ దేవాలయం కూల్చివేతపై కరాటే కళ్యాణి ఆగ్రహం”
Comments are closed.