మరోసారి వివాదంలో నటి కల్పిక (Video)

మరోసారి నటి కల్పిక వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్‌లోని కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్స్‌లో ఆమె హంగామా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కల్పిక రిసార్ట్స్ మేనేజర్‌పై దురుసుగా ప్రవర్తించినట్లు కనిపిస్తోంది. మెనూ కార్డు, తాళంచెవి లాంటివి విసిరేస్తూ ఆగ్రహంగా ప్రవర్తించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.

అయితే, ఈ ఘటనపై నటి కల్పిక తన వైపు నుంచి వివరణ ఇచ్చారు. తాను అన్యాయంగా వ్యవహరించలేదని, కొన్ని కారణాల వల్లే ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. రిసార్ట్స్ వివాదంపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Read More : విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్