తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కేసీఆర్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కాకుండా చర్చకు రావాల్సింది” అని పేర్కొన్నారు. చర్చకు రాకుండా గవర్నర్ ప్రసంగానికి వస్తే దాని అర్థమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ తెలిపారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క పాలసీ తేలేదని” అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో నిరుద్యోగం శాతం 8.8 నుంచి 6.1 శాతానికి తగ్గిందని తెలిపారు. రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పన్ను వసూళ్లలో కూడా ముందంజలో ఉందని వివరించారు.
రైతుల పొలాలు ఎండిపోతుంటే, టన్నెల్‌లో ప్రాణాలు పోతుంటే, ప్రజలు కష్టాల్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, దానిని ఫొటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ అన్నారు. “తానేవరూ తెలీకుండా పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారా?” అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో తనకు విబేధాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం అయినందునే తనను ప్రశ్నిస్తున్నారని, అలాగే కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నందున ఆయన్నీ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల కేంద్రమంత్రులు తమ రాష్ట్రాలకు అవసరమైనవన్నీ సాధించుకుంటున్నారని, కానీ కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రధాని ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో, మూసీ ప్రాజెక్టులు మాత్రమే అడుగుతున్నట్లు వెల్లడించారు. “మెట్రో ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతి వస్తే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాదును గేమ్ ఛేంజర్ నగరంగా మార్చే ప్రాజెక్టు మెట్రో” అని సీఎం రేవంత్ తెలిపారు.

One thought on “సీఎం రేవంత్: కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి”
Comments are closed.