తెలంగాణ బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినా, ఇంకా ఆమోదం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇండియా కూటమి మద్దతు ఇస్తుందని తెలిపారు.
రాష్ట్రపతిని అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని రేవంత్ మండిపడ్డారు. “మోదీ, అమిత్ షా అడ్డుకుంటున్నారేమో అన్న అనుమానం కలుగుతోంది” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుంటే ప్రధాని మోదీని గద్దె దించుతామని రేవంత్ హెచ్చరించారు. “బీసీ రిజర్వేషన్లు ముస్లింల కోసం కాదు, బలహీన వర్గాల కోసం. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం బీజేపీ కుట్ర” అని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read More : జగిత్యాల డీటీఓ ఏసీబీకి చిక్కాడు

One thought on “రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాలేదు: సీఎం”
Comments are closed.