సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ?

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సీరియస్‌ అయింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసుల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సీ, సంధ్య థియేటర్ తొక్కిసలాట దర్యాప్తు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘటన జరిగి చాలా కాలమైనా దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై ప్రశ్నించింది. అంతేకాకుండా, ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబానికి తక్షణమే పరిహారం అందించాలని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.

ఈ నోటీసులపై వెంటనే స్పందించి, తదుపరి చర్యలను వివరించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించింది. ఈ నోటీసుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసుపై మరింత వేగంగా స్పందించే అవకాశం ఉంది.

Read More : రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాలేదు: సీఎం