చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన “లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత” సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నారులపై లైంగిక హింసను సమాజం మొత్తంగా ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బాధిత చిన్నారులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా బాధితులకు అన్ని విధాల భద్రత, న్యాయ సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువత, ప్రజలు సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. లైంగిక దాడుల కేసుల్లో నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారి పాలిట చట్టం గట్టి శిక్షగా మారుతుందని హెచ్చరించారు.
ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు న్యాయమూర్తులు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More : మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్…

One thought on “చిన్నారులపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు తప్పవు: సీఎం”
Comments are closed.