ఏపీలో రేపు కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు (జూలై 6) అన్ని ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల్లో కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందించనున్నారు. జనంలో జాగృతి కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా, దగ్గర్లోని ఆసుపత్రులకు ప్రజలు తమ పెంపుడు కుక్కలను తీసుకెళ్లి టీకా వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా రేబిస్ వ్యాధిని సమర్థంగా నివారించవచ్చని పేర్కొన్నారు.

పశుసంవర్ధక శాఖ సూచించిన సమయాల్లో ఆసుపత్రులను సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read More : Godavari : 20 అడుగులకు చేరిన నీటిమట్టం

One thought on “ఏపీలో రేపు కుక్కలకు ఉచిత యాంటీ రేబిస్ టీకాలు

Comments are closed.