ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన పాలన విధానాలు, అభివృద్ధి లక్ష్యాలపై 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి స్వయంగా వివరాలను సమర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, వాట్సాప్ గవర్నెన్స్ విధానం తదితర అంశాలపై ఆర్థిక సంఘ సభ్యులతో చర్చలు సాగాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ఆర్థిక సంఘ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, ఈ విధానం ద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే అవసరమైన సేవలను వాట్సాప్ ద్వారానే పొందేలా సౌకర్యం కల్పించడాన్ని కమిషన్ అధినేత పనగరియా ప్రశంసించారు. ఈ విధానం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారా? అనే ప్రశ్నను పనగరియా ఉద్దేశిస్తూ అడిగారు. ఇందుకు స్పందించిన సీఎం చంద్రబాబు, వచ్చే నెలలో ప్రధాని మోదీతో జరగనున్న భేటీలో ఈ ప్రాజెక్ట్‌ను వివరంగా వివరించనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1,000 ప్రభుత్వ సేవలను అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి స్వయంగా ప్రజెంటేషన్ ఇవ్వడం అరుదైనదని కమిషన్ సభ్యులు అభిప్రాయపడారు. రాష్ట్ర వృద్ధి గణాంకాలను ఎంతో లోతుగా అధ్యయనం చేసి కేంద్రం నుండి సాయం పొందే ప్రయత్నాలపై చంద్రబాబు దృష్టిని ప్రశంసించారు.
అంతేకాకుండా, 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ను చూసినపుడు, ఇప్పటి అభివృద్ధిని పోల్చుకుంటే ఇది పూర్తిగా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ఆర్థిక సంఘ సభ్యురాలు అన్నెజార్జ్ మాథ్యూ అన్నారు. ఇదే స్థాయిలో అమరావతిను కూడా అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆమె పేర్కొన్నారు.
Read More : పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీబీఐ విచారణ కోరిన కేఏ పాల్ — హైకోర్టులో విచారణ

One thought on “ఆర్థిక సంఘం ఎదుట సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ — వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రశంసలు వెల్లువ”
Comments are closed.