సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా నిలిచిన ఖుష్బూ, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో అనేక హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. పెళ్లి తర్వాత కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి, తన వ్యక్తిగత జీవితం గడిపిన ఖుష్బూ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి, మళ్లీ తనదైన శైలిలో సత్తా చాటుతోంది. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ఒకవైపు నటిగా కొనసాగుతుంటే, మరోవైపు తన భర్త దర్శకుడిగా సినిమాలకు నిర్మాతగా, అలాగే రాజకీయాల్లోనూ పాత్ర పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
కాగా, ఖుష్బూ గురించి తాజాగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఒకప్పుడు బాగా బొద్దుగా ఉండే ఆమె ప్రస్తుతం తన బరువు తగ్గించి సన్నగా మారడం అందరి దృష్టిని ఆకర్షించింది. 54 ఏళ్ల వయసులో ఖుష్బూ ఈ భారీ బరువు తగ్గింపు సాధించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల ఖుష్బూ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ “బ్యాక్ టూ ఫ్యూచర్” అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫోటోల్లో ఆమె గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో చాలా సన్నగా, అందంగా కనిపిస్తోంది. ఆమె లుక్ లో జరిగిన మార్పు కొంతమంది నెటిజన్లను ఆకర్షించగా, మరికొందరు మాత్రం ట్రోలింగ్ చేశారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఖుష్బూ ఫోటోలు మరియు ఆపై ఇచ్చిన కౌంటర్ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక నెటిజన్ ఖుష్బూ బరువు తగ్గడాన్ని ఇంజెక్షన్ల ద్వారా చేశారని కామెంట్ చేయగా, ఖుష్బూ స్పందిస్తూ, “మీరు ఎలా ఉంటారు? మీ ముఖాన్ని ఎప్పుడూ చూపించరు. ఎందుకంటే మీరంతా అసహ్యంగా ఉంటారు,” అంటూ ఫైర్ అయ్యింది. ఈ ట్వీట్ ప్రస్తుతం నెటిజన్ల మధ్య చర్చకు కారణమైంది.
What a pain people like you are. You guys never show your faces becoz you know you are ugly from within. I pity your parents. https://t.co/IB0RMRatxl
— KhushbuSundar (@khushsundar) April 15, 2025

One thought on “బరువు తగ్గిన ఖుష్బూ : ట్రోలర్లకు ధీటైన కౌంటర్”
Comments are closed.