పల్నాడు జిల్లాలో జరిగిన వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మాజీ మంత్రి విడదల రజని సోమవారం సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రజని… జగన్ పర్యటనకు ఏర్పాట్లు చేసినందుకే తమపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. జగన్ పర్యటనకు ప్రత్యేకంగా తాము జన సమీకరణ చేయలేదని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని ఆమె పేర్కొన్నారు. “జగన్ ప్రజల గుండెల్లో ఉన్న నేత. ఆయన్ను కలుసుకోవడానికి ప్రజలు తమంతట తామే వస్తారు. ప్రత్యేక ఏర్పాట్ల అవసరం లేదు,” అని అన్నారు.
జగన్ పర్యటనకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించిందని, పోలీసుల చేతుల మీదుగా వైసీపీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రజలు ఇప్పుడు జగన్ వైపే చూస్తున్నారని తెలిపారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై గత ఏడాది నుంచి అసత్య ఆరోపణలతో కేసులు పెడుతున్నారని రజని ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిపైనూ తప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని అన్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
Read More : ఏపీ మున్సిపల్ శాఖ ఔట్సోర్సింగ్ వర్కర్లకు శుభవార్త
