పేదరికాన్ని నిర్మూలించేందుకు అమలు చేస్తున్న పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పీ4 – జీరో పావర్టీపై సమగ్రంగా చర్చ జరిగింది. ఇప్పటి వరకు 18,332 మంది మార్గదర్శకులుగా ముందుకు వచ్చారు. వీరిలో ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, ఉన్నత వర్గాల ప్రముఖులు ఉన్నారు. వారి సాయంతో ఇప్పటివరకు 1,84,134 బంగారు కుటుంబాలకు మద్దతు లభించింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు మార్గదర్శకుల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన అమరావతిలో టాప్ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, ఎంఎన్సీ ప్రతినిధులు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సెలబ్రిటీలు ఇలా సుమారు 200 మంది మార్గదర్శకులతో సీఎం చంద్రబాబు విందు సమావేశం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన లక్ష్యాలు, ప్రయోజనాలను వివరించి మరింత మందిని భాగస్వాములుగా చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
పేదలకు అండగా ఉండేందుకు సమాజంలో ఉన్న వివిధ వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే పీ4 లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More : వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు నమోదు

One thought on “పీ4పై చంద్రబాబు కీలక ప్రణాళికలు”
Comments are closed.