AP – శ్రీసిటీలో ఎల్‌జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.

nara lokesh

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన దిశగా మరో భారీ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ రాష్ట్రంలో భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతుంది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఈ నూతన ప్లాంట్ నిర్మాణానికి బుధవారం నారా లోకేశ్ భూమిపూజ చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చే ఆరు సంవత్సరాల్లో దశలవారీగా రూ.5,001 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ఎల్‌జీ వెల్లడించింది. దీంతో సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.

శ్రీసిటీలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్లు సహా ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయనున్నారు. అంతేకాక, వీటికి అవసరమైన కంప్రెసర్లు, మోటార్ కంప్రెసర్లు, హీట్ ఎక్స్చేంజర్లు లాంటి కీలక విడిభాగాలను కూడా రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

అంతేకాక, ప్రధాన యూనిట్‌కు తోడుగా రూ.839 కోట్లతో మరో ఐదు అనుబంధ యూనిట్లను కూడా ఏర్పాటుచేయనున్నారు. మంత్రి నారా లోకేశ్‌ కృషితో రాష్ట్రానికి వచ్చిన ఈ భారీ పెట్టుబడులు యువతకు ఉపాధి కల్పించడంతోపాటు ‘యువగళం’లో ఆయన ఇచ్చిన హామీలకు అమలుగా నిలుస్తున్నాయి.

Read More : జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో ఊరట

One thought on “AP – శ్రీసిటీలో ఎల్‌జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్.

Comments are closed.