తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.45 కోట్ల మానీల్యాండరింగ్ ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. విచారణ ఎదుర్కొనే సమయంలో అరెస్ట్ అయ్యే భయమే ఆయన ఆత్మహత్యకు కారణంగా ఉన్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారికంగా పూర్తి సమాచారం రానప్పటికీ, ఈ ఆత్మహత్య నేపథ్యంలో డెయిరీ వ్యవహారాలపై దర్యాప్తు మరింత వేగం పొందే అవకాశం ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : పీ4పై చంద్రబాబు కీలక ప్రణాళికలు

One thought on “తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

Comments are closed.