డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Nara chandrababu

డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన – ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.

మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచేందుకు కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించిన చంద్రబాబు, సోమవారం జరిగిన పరిణామాలను రాష్ట్ర రాజకీయాల్లో చీకటి రోజుగా అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించాలనే డిమాండ్‌ను ప్రజలు బలంగా ఆలోచించాలని సూచించారు. “ప్రతిపక్ష హోదా మేం ఇవ్వలేం, అది ప్రజలే నిర్ణయించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

కూటమి ఏర్పాటుపై స్పందించిన చంద్రబాబు, తమకు వ్యక్తిగత ప్రయోజనాలేమీ లేవని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా ఏర్పడ్డామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని మరోసారి హామీ ఇచ్చారు.

Read More