మిర్చి మద్దతు ధరపై ముదురుతున్న రాజకీయం – లోకేష్‌కు అంబటి సవాల్

rambabu

మిర్చి రైతుల ఆగ్రహం – ప్రభుత్వానికి సవాలు

“ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిలో కూర్చొని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో సమావేశాలు పెట్టడం ఎంతవరకు ఉపయోగం? మిర్చి యార్డుకి వచ్చి, మా కష్టాలను స్వయంగా చూసి, మా సమస్యలు వినాలి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. క్వింటాలుకు కనీసం రూ.19,000 నుంచి రూ.20,000 మద్దతు ధర విధించాలి” అని మిర్చి రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “మిర్చి రైతులకు చంద్రబాబు మద్దతుగా నిలిచారు. ఆయన కారణంగానే మిర్చి మద్దతు ధర రూ.11,781గా నిర్ణయించబడింది” అంటూ తన వాదన వినిపించారు. పైగా, ఇది తగినంత ధరగా, ఇంతకుమించి అవసరం లేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించడం రైతులకు ఆగ్రహం కలిగించింది.

దీనిపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. “లోకేష్ అసెంబ్లీలో చెప్పిన మాటలు మిర్చి యార్డులో రైతుల ముందు చెప్పగలరా?” అంటూ ఆయన సవాలు విసిరారు. ఈ మేరకు, తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా నారా లోకేష్‌కు నిలదీశారు.

Read More