గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంలో జీవో నెంబర్ 16(GO 16) తీసుకొచ్చి వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్(Contract employee Regularize) చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తూ జీవో16 తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ జీవో ద్వారా రెగ్యులరైజ్ చేయబడ్డ వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రెగ్యులరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ.. జీవో16ని సవాల్ చేస్తూ హైకోర్టుని(TS High court) ఆశ్రయించిన తెలంగాణ నిరుద్యోగ జేఏసీ(JAC). దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా జీవో16ని కొట్టివేస్తూ, అది రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో రెగ్యులరైజ్ చేయబడ్డ కాంట్రాక్టు ఉద్యోగులు ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదని వాపోతున్నారు.
Share This
