భారత సైన్యం మీద తప్పుడు ప్రచారం

భారత సాయుధ బలగాలపై తప్పుడు సమాచారం పంచుతున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం నిషేధించింది. తప్పుడు ప్రచారాన్ని ఆపాలని మే 7న భారత రాయబార కార్యాలయం హెచ్చరించినప్పటికీ అవి కొనసాగించడంతో ఈ చర్య తీసుకుంది.

పాకిస్థాన్ అనుకూల హ్యాండిళ్లు, కొన్ని మీడియా సంస్థలు రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించడాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది. వైరల్ అయిన ఫోటో 2021లో పంజాబ్‌లో కూలిన మిగ్-21కి చెందినదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో, అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పెట్టిన కొత్త పేర్లను భారత విదేశాంగ శాఖ ఖండించింది. అరుణాచల్ ఎప్పటికీ భారతదేశంలోనే భాగమని, చైనా ఇచ్చే పేర్లతో వాస్తవాలు మారవని వెల్లడించింది.

Read More : రాష్ట్రపతిని కలిసిన త్రివిధ దళాధిపతులు

One thought on “భారత సైన్యం మీద తప్పుడు ప్రచారం

Comments are closed.