పాకిస్థాన్ సిబ్బందితో

ఒడిశా పరదీప్ ఓడరేవులో బుధవారం ఉదయం ఒక వాణిజ్య నౌక రాకతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దక్షిణ కొరియా నుంచి సింగపూర్ మీదుగా వచ్చిన ‘ఎమ్‌టి సైరెన్ II’ నౌక భారత్‌లోని పరదీప్ పోర్టుకు చేరింది. ఈ నౌక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) కోసం ముడి చమురును రవాణా చేస్తోంది.

నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 21 మంది పాకిస్థాన్ పౌరులు కావడం అధికారులు గుర్తించారు. ఈ విషయం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టికి వచ్చి వెంటనే మెరైన్ పోలీసులు, CISF సిబ్బంది అప్రమత్తమయ్యారు.

పారిశ్రామిక భద్రత దృష్ట్యా పోర్టు పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. సీఐఎస్‌ఎఫ్, మెరైన్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ నౌక పోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలోని ‘పీఎమ్ బెర్త్’ వద్ద నిలిపి ఉంది. ఇందులో సుమారు 11,350 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది.

ముడి చమురు పూర్తిగా అన్‌లోడ్ అయిన తర్వాత మాత్రమే సిబ్బంది నౌక దిగేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ చర్యలు అన్ని భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారని స్పష్టం చేశారు.

Read More : భారత సైన్యం మీద తప్పుడు ప్రచారం