రాజ్యసభలో వందే భారత్ రైళ్ల సగటు వేగం తగ్గుదలపై కీలక చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. తాజా గణాంకాల ప్రకారం వందే భారత్ రైళ్ల సగటు వేగం 84.48 కి.మీ. నుండి 76.25 కి.మీ.కి పడిపోయిందని ప్రశ్నలో పేర్కొనగా, దీనిపై స్పందించిన మంత్రి “రైళ్ల సగటు వేగం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ట్రాక్ జ్యామితి, రైళ్ల నిలుపులు, నిర్వహణ వంటి అంశాలు వేగాన్ని ప్రభావితం చేస్తాయి” అని తెలిపారు.
అదే సమయంలో వందే భారత్ రైళ్లు 180 కి.మీ. వేగానికి అనుగుణంగా రూపకల్పన చేయబడ్డాయని, కానీ ప్రస్తుతానికి ఆపరేషనల్ పరిమితి 160 కి.మీ. వేగం వరకు మాత్రమే ఉన్నదని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ అంశంపై మరిన్ని సాంకేతిక మార్పులు, మౌలిక వసతుల మెరుగుదల కోసం రైల్వే శాఖ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆయన హామీ ఇచ్చారు.
Read More : ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఘర్షణ

One thought on “వందే భారత్ రైళ్ల సగటు వేగం తగ్గుదలపై రాజ్యసభలో చర్చ”
Comments are closed.