ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. పని తీరులో మెరుగులు తీసుకోకపోతే పదవులు నిలవవని మంత్రులకు తేల్చిచెప్పారు.
అమరావతిలో మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… “ప్రస్తుతం రాజకీయాలు విషయ నిపుణతకంటే ప్రచార పటిమ ఆధారంగా సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉంది. తప్పుడు ప్రచారాలకు తక్షణమే స్పందించకపోతే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం తగ్గిపోతుంది. మీ కృషి కనబడకపోతే పదవులపై ముప్పు ఉంటుంది” అని అన్నారు.
వైసీపీ నేతలు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని, వారి వాస్తవ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మంత్రులదేనని పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగేలా ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను బలంగా వివరించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే విషయాలపై సహనంతో కాకుండా, సమర్థంగా స్పందించాలని ఆదేశించారు.
Read More : చంద్రబాబు గట్టి హెచ్చరిక మంత్రులకు
