బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ అవసరం లేదు: High Court

ముంబైలో ఓ వివాహితపై భర్త వ్యభిచార ఆరోపణలు చేస్తూ విడాకులు కోరిన కేసులో, బాలుడికి డీఎన్ఏ పరీక్ష చేయాలంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు రద్దు చేసింది. 2011లో పెళ్లి అయిన ఈ దంపతులు 2013 నుండి వేరుగా ఉంటున్నారు. అప్పట్లో మహిళ మూడు నెలల గర్భవతిగా ఉండగా, భర్త బిడ్డ తనదే కాదని అనుమానించాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు 2020లో డీఎన్ఏ పరీక్షకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా, మైనర్ బాలుడి హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యత అని హైకోర్టు స్పష్టం చేసింది.

వివాహేతర సంబంధాలను నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్ష తప్పనిసరి కాదని, ఇతర ఆధారాలు కూడా ఉపయోగించవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రుల వివాదాల్లో పిల్లలను సాధనంగా ఉపయోగించరాదని, వారి వ్యక్తిగత గోప్యతను భంగం చేసే చర్యలు తగవని కోర్టు పేర్కొంది. అలాగే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ, చిన్న వయసులో బలవంతంగా రక్త పరీక్షలు చేయడం న్యాయవిరుద్ధమని స్పష్టం చేసింది.

Read More : ఇంటికి వెళ్లాల్సిన వైద్యుడు అదృశ్యమయ్యాడు

One thought on “బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ అవసరం లేదు: High Court

Comments are closed.