బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్’ ను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా ప్రధాని మోదీకి ప్రదానం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ పాత్ర ప్రశంసనీయమని, అంతర్జాతీయ వేదికలపై సహకారాన్ని విస్తరించడంలో ఆయన ప్రాధాన్యతను గుర్తించి ఈ గౌరవాన్ని అందించామని బ్రెజిల్ పేర్కొంది.
ఇది మోదీకి లభించిన 26వ అంతర్జాతీయ గౌరవ పురస్కారం కావడం విశేషం. భారత ప్రధానికి వరుసగా వర్తమాన ప్రపంచంలో విశేష గుర్తింపు లభిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More : హుమైరా అస్గర్ అనుమానాస్పద మృతి

One thought on “మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం”
Comments are closed.