దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాలను (Digital Fraud) అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 83,668 WhatsApp అకౌంట్లు, 3,962 Skype అకౌంట్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.
కేంద్ర సహాయ హోం మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) పార్లమెంటులో మాట్లాడుతూ 7.81 లక్షల మోసపూరిత లింక్ ఉన్న SIM Cards ఫిబ్రవరి 28 నాటికి డీయాక్టివేట్ (Deactivated) చేసినట్లు తెలిపారు.
అంతేకాదు, 2021 నుంచి దేశంలోని సైబర్ భద్రతా (Cyber Authorities) విభాగాలు మోసగాళ్ల నుండి దాదాపు ₹4,386 కోట్ల ఆర్థిక నష్టం (Financial Fraud) నివారించినట్లు వెల్లడించారు. డిజిటల్ మోసాలను అడ్డుకునేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More :

One thought on “కేంద్ర ప్రభుత్వం భారీ డిజిటల్ మోసాలపై కఠిన చర్యలు – వేలాది *WhatsApp*, *Skype* అకౌంట్లు బ్లాక్”
Comments are closed.