అమెరికా నిధుల కోతతో లక్షల చిన్నారుల ప్రాణాలకు ముప్పు

bill gates

ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వం నిధులలో కోత విధించడంపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ బిల్ గేట్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన 25 ఏళ్ల అనుభవం ఆధారంగా, ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గేట్స్ హెచ్చరించారు. ఇటీవల ‘లాన్సెట్’ పత్రికలో ప్రచురితమైన అధ్యయనాన్ని ఉటంకించిన ఆయన, అమెరికా సహాయం ఇలా కొనసాగితే 2040 నాటికి 80 లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులు మరణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. “ఈ సంఖ్య ఎంత భయంకరంగా ఉందో తెలుసుకోవాలంటే అమెరికాలోని పలు ప్రముఖ రాష్ట్రాల్లో ఉన్న చిన్నారుల మొత్తం సంఖ్యతో సమానం” అని వివరించారు.

ప్రపంచ ఆరోగ్య రంగంలో పని చేసిన అనుభవంతో తనకు ఈ అంశంపై స్పష్టమైన అవగాహన ఉందని, అమెరికా నిధుల ఉపసంహరణ వల్ల ప్రాణాలు పోతాయని తాను స్పష్టంగా చెబుతున్నానని తెలిపారు. నైజీరియా, ఇథియోపియా పర్యటనల్లో తాను స్వయంగా ఆరోగ్య సేవల మందకూడడం, మందుల పంపిణీలో జాప్యం చూస్తే బాధ కలిగిందని గేట్స్ చెప్పారు. అయితే పరిస్థితి ఇప్పటికీ మార్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. పెప్‌ఫార్, గ్లోబల్ ఫండ్ వంటి కీలక ఆరోగ్య కార్యక్రమాలకు నిధులను తిరిగి మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్‌ను ఆయన కోరారు.

ఈ విషయంలో శాస్త్రీయ విజ్ఞానం, ప్రణాళికతో ముందుకు వెళ్లితే లక్షల మంది చిన్నారుల ప్రాణాలు రక్షించవచ్చని గేట్స్ తేల్చిచెప్పారు.

Read More : Kill the leader of Iran : ఇజ్రాయెల్ మంత్రివర్యుల సంచలన వ్యాఖ్యలు!

One thought on “అమెరికా నిధుల కోతతో లక్షల చిన్నారుల ప్రాణాలకు ముప్పు

Comments are closed.