ముంబయిలో నిర్వహించిన “GQ’s Most Influential Young Indians 2025” ఈవెంట్‌లో టాలీవుడ్ బ్యూటీస్ సమంతా రూత్ ప్రభు, శ్రీలీలా ఒకే వేదికపై కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. సినీ ప్రపంచానికి చెందిన ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్ట్రెస్‌లు స్టైల్, గ్రేస్‌లతో రెడ్ కార్పెట్‌పై వాక్ చేస్తూ మెరుపులు మెరిపించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సమంతా, శ్రీలీలా ఇద్దరూ ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోతూ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వీరి ఫొటోలు వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. తక్కువ వయసులోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు తారలు “ఇన్‌ఫ్లూయెన్షియల్ యంగ్ ఇండియన్స్” జాబితాలో ఉండటం గర్వించదగిన విషయం.
ఈ ఈవెంట్‌లో పలు రంగాలకు చెందిన యువ ప్రతిభావంతులు, ప్రముఖులు పాల్గొన్నారు. సమంతా, శ్రీలీలలు తమ ఫ్యాషన్‌తో పాటు వినయంగా సందడి చేయడంతో ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


Read More : Rashmika : పాన్ ఇండియా సినిమా ‘మైసా’ ప్రకటన

One thought on “సమంతా, శ్రీలీలా గ్లామర్‌తో మెరిశారు:”
Comments are closed.