భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ద్విదిన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా, భారత్‌కు ఆ దేశంతో ఉన్న బలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను గౌరవంగా ప్రస్తావించారు. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిస్సేస్సర్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయోధ్య రామ మందిర నమూనాను, పవిత్ర సరయూ నదీ జలాన్ని, ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా తీర్థాన్ని ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలుగా ట్రినిడాడ్ ప్రధాని కమలాకు బహూకరించారు. ఈ బహుమతులు రెండు దేశాల మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలిపారు. విందు కార్యక్రమంలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రత్యేక అంశాలు కూడా చోటుచేసుకున్నాయి. అక్కడి భారతీయ మూలాలున్న ప్రజలు పవిత్రంగా భావించే సోహరి ఆకుపై భోజనం వడ్డించడం విశేషంగా నిలిచింది. ఇది పండుగలు, ప్రత్యేక వేడుకల సమయంలో అక్కడ జరిగే సంప్రదాయంగా పేర్కొనబడింది.
అలాగే, మోదీ భోజ్‌పురి చౌతాల్ సంగీత ప్రదర్శనను తిలకించారు. అంతేకాకుండా, గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘వైష్ణవ జన తో’ గీతాన్ని ఆలపించిన స్థానిక గాయకుడు రాణా మోహిప్‌ను ప్రత్యక్షంగా కలిసి అభినందించడం ఈ పర్యటనలో మరొక ప్రత్యేకతగా నిలిచింది.
Read More : నాయకుల సంభాషణపై ఆసక్తికర చర్చలు

One thought on “ఆధ్యాత్మిక బంధాలను చాటిన భారత్”
Comments are closed.