ఇరాన్‌తో ఇటీవల జరిగిన 12 రోజుల యుద్ధ సమయంలో ఖమేనీని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. తగిన అవకాశమివ్వకపోవడంతో ఆ ఆపరేషన్ విఫలమైందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతానికి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇజ్రాయెల్‌కి చెందిన ‘ఛానల్ 13’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాట్జ్ మాట్లాడుతూ, “మేము ఖమేనీని హతమార్చాలని నిర్ణయించుకున్నాం. కానీ ఆపరేషన్‌ను అమలు చేసే సరైన పరిస్థితి రాలేదు” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖమేనీ చాలా లోతైన అండర్‌గ్రౌండ్‌కి వెళ్లిపోయారని, జనరల్స్‌తో సంబంధాలు కూడా తెంచుకున్నారని ఆరోపించారు.
అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
ఇరాన్‌పై మరో దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాట్జ్ తెలిపారు. గతంలో వాషింగ్టన్ ఈ కుట్రకు వ్యతిరేకమని వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. “ఇరాన్ అణు కేంద్రాల పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తే, మళ్లీ దాడికి సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.
ఇరు దేశాల ఘనవిజయ ధీమా
యుద్ధంలో రెండు దేశాలు తమవైపు విజయం సాధించామని ప్రకటించుకున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, “ఇరాన్‌పై గట్టి పోరాటం చేసి విజయం సాధించాం. ఇది అరబ్ దేశాలతో శాంతి ఒప్పందాలకు బలాన్ని ఇస్తుంది” అన్నారు. మరోవైపు, ఇరాన్ కూడా తమ క్షిపణి దాడులతో నెతన్యాహు యుద్ధం ముగించేందుకు బలవుతుండటమే తమ విజయం అని ప్రకటించింది.
ఉద్రిక్తతకు ముగింపు ఎప్పటికి?
ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత యుద్ధం ముగిసినట్లుగా ప్రకటించబడినప్పటికీ, ఇరు దేశాల పరస్పర విమర్శలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి.
Read More : చైనాలో వర్షాల బీభత్సం: గుయిజౌ నగరాలు జలదిగ్బంధం

One thought on “Kill the leader of Iran : ఇజ్రాయెల్ మంత్రివర్యుల సంచలన వ్యాఖ్యలు!”
Comments are closed.