గత నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. అమాయకులైన 26 మంది పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఈ దారుణ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం “ఆపరేషన్ సిందూర్” పేరిట పీఓకేతో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు పాల్పడింది.
ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీనితో ఆగ్రహించిన పాక్… భారత ఆర్మీ సదుపాయాలు, జనవాసాలను లక్ష్యంగా చేసుకుని వందలాదిగా డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది.
అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థలు–ఆకాశ్, ఎస్–400లు యాక్టివ్ అయ్యాయి. పాక్ క్షిపణులను సమర్థవంతంగా వెనక్కి తిప్పడంతో పాటు నేలమట్టం చేశాయి. పాక్ మిస్సైల్స్, డ్రోన్ల శకలాలు చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇప్పటికే పాకిస్థాన్‌పై జరిపిన దాడుల వీడియోలను విడుదల చేసిన భారత ఆర్మీ… తాజాగా పాక్ క్షిపణులను ఎలా కూల్చారో చూపించే వీడియోను “వెస్ట్రన్ కమాండ్” ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో షేర్ చేసింది. ‘‘భారత ఆర్మీ అగ్ని గోడలా శత్రు దేశపు క్షిపణులను అడ్డుకుని నేలమట్టం చేసింది’’ అని పేర్కొంది.
ఈ వీడియో సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా… నెటిజన్లు భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read More : తాజ్ హోటల్, విమానాశ్రయంలో భద్రతా సడలింపు.

One thought on “పాక్ క్షిపణులను నేలమట్టం చేసిన భారత్…”
Comments are closed.