విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని మహిళా మండల కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన ఓ కారులో నాలుగు చిన్నారులు సరదాగా కూర్చున్న సమయంలో అపార్థంగా కార్ డోర్ లాక్ అయింది.
వెంటనే కారు తలుపులు తాళం పడిపోవడంతో ఆలోపల ఉన్న పిల్లలు ఊపిరాడక చనిపోయారు. మృతులుగా గుర్తించిన వారు:
- మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8)
- బుర్లు ఆనంద్, ఉమా దంపతుల కుమార్తెలు చారుమతి (8), చరిష్మా (6)
- కంది సురేష్, అరుణ దంపతుల కుమార్తె మనస్విని
ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా నాలుగు చిన్నారులను కోల్పోయిన కుటుంబాల్లో తీవ్ర శోకసంద్రం నెలకొంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Mode : Free Bus : సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

One thought on “విజయనగరం జిల్లాలో విషాదం”
Comments are closed.