తాజ్ హోటల్, విమానాశ్రయంలో భద్రతా సడలింపు.

ముంబై నగరంలో నేడు తీవ్రమైన కలకలం రేగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ప్రసిద్ధ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కి బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలియడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తత ఏర్పడింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ రెండు ప్రాంతాల్లో శక్తివంతమైన పేలుళ్లు జరగబోతాయని ఒక ఈ-మెయిల్ పోలీసులకు అందింది. వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా పోలీసులు క్షుణ్ణమైన తనిఖీలు ప్రారంభించారు.

గంటల తరబడి పరిశీలన చేసిన అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు కనబడలేదు. విమానాశ్రయ పోలీసులు ఈ బెదిరింపు ఈ-మెయిల్ నకిలీగా నిర్ధారించారు. ప్రజలను భయపెట్టేందుకు అలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఈ-మెయిల్ ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ఈ ఘటన కారణంగా మొదట ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, తనిఖీల తర్వాత పరిస్థితి సవ్యంగా ఉందని వెల్లడించడంతో ప్రయాణికులు, హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Read More : మానవత్వం చాటుకున్న సైనికులు…

One thought on “తాజ్ హోటల్, విమానాశ్రయంలో భద్రతా సడలింపు.

Comments are closed.