తెలంగాణ రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కీలక నిర్ణయం బీసీ వర్గాలకు న్యాయం చేస్తోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు నిలువెత్తు నిదర్శనంగా ఈ నిర్ణయం నిలుస్తోందని చెప్పారు. కేంద్రం ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోని వేళ.. రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి ఆర్డినెన్స్ తీసుకురావడం అభినందనీయమన్నారు.
బీసీల హక్కులకు మద్దతుగా ఈ నిర్ణయాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా స్వాగతించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే గతంలో బీసీల కోసం పోరాటం చేయని ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబరాల్లో పాల్గొనడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
Read More : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

One thought on “బీసీలకు 42% రిజర్వేషన్ హర్షణీయం: ఆది శ్రీనివాస్”
Comments are closed.