ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

తెలంగాణలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు కట్టడి విధించింది. ఫీజులు పెంచాలన్న కాలేజీల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో అన్యాయంగా పెంపు ఉండకూడదని స్పష్టం చేసిన హైకోర్టు, ఫీజుల నియంత్రణ కమిటీ (FRC)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఆరు వారాల్లోగా ఫీజులను నిర్ణయించాలంటూ కమిటీకి హైకోర్టు సూచించింది.

ప్రైవేట్ కాలేజీల డిమాండ్లపై హైకోర్టు వ్యవహరించిన తీరు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం చేస్తోంది.

Read More : యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

One thought on “ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు

Comments are closed.