విజయవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రిటైర్డ్ ఇంజనీర్ బొద్దులూరి వెంకట రామారావు (70)ను ఆయన ఇంటి పనిమనిషి అనూష హత్య చేసి, బంగారు ఆభరణాలతో పరారైన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం… అనూష, తన భర్త సాయితో కలిసి రామారావును దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో గదిలో లైట్లు వెలిగిపోవడంతో అనుమానం వచ్చిన యజమాని తల్లి సరస్వతి గది వద్దకు వెళ్లి చూడగా, రామారావు అపస్మారక స్థితిలో కూర్చొన్నట్టు కనిపించగా వెంటనే ఘటనను పోలీసులకు తెలియజేశారు. స్ధలానికి చేరుకున్న పోలీసులు రామారావును పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇంట్లో బీరువా పగిలిపోవడం, అనూష కనిపించకపోవడంతో ఆమెపై అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. చివరికి తెల్లవారుజామున 6 గంటల సమయంలో అనూషను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆమె వద్ద నుంచి కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి విచారణ కొనసాగుతోంది.
Read More : ఏపీలో మితిమీరుతున్న మందుబాబుల హల్చల్

One thought on “యజమానిని హత్య చేసి బంగారు నగలతో పరారైన పనిమనిషి”
Comments are closed.