కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వంద మంది ఒవైసీ వంటి వారు వచ్చినా ఈ బిల్లును ఆపలేరని, ఒవైసీ తాత వచ్చినా బిల్లు ఆగదని స్పష్టం చేశారు. దేశంలోని ముస్లిం సమాజం, మేధావులు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని ఆయన తెలిపారు. ఒక్కడు ఒవైసీ వచ్చి ఈ బిల్లును ఆపగలడా? అని ప్రశ్నించారు.
పేదల కోసం బిల్లు: బండి సంజయ్
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకువస్తామని ప్రకటించినప్పుడు, కరీంనగర్‌లోని ఒక పేద వ్యక్తి తనకు గుర్తుకు వచ్చాడని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్‌లోని న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం కేంద్ర సహాయ మంత్రి రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయనను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డు బిల్లుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు.
వక్ఫ్ బోర్డు సమస్యలపై స్పందన
ఈ బిల్లును మతపరమైన కోణంలో చూడకూడదని, దేశ ప్రజల హితం కోసం కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని బండి సంజయ్ అన్నారు. వక్ఫ్ బోర్డు పేరుతో పేదలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో తనకు తెలుసని చెప్పారు. కరీంనగర్‌లో ఓ పేద వ్యక్తి ఇల్లు నిర్మించుకోవడానికి అనుమతులు రద్దు చేయించారని, అది వక్ఫ్ బోర్డు స్థలమని పేర్కొన్నారని అన్నారు. ఆ వ్యక్తి తాత, ముత్తాతలు కూడా అదే ఇంట్లో నివసించారని ఆయన వివరించారు.
విపక్షాల వ్యతిరేకతపై బండి సంజయ్ ధ్వజమెత్తు
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మతం రంగు అద్దాలని కొందరు లౌకికవాదులు, ఒవైసీ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని, అందులో భాగంగా పలుమార్లు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. కోర్టు ముందు చెట్లు తొలగించినందుకు, పాకిస్థాన్-భారత్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జెండాలు పట్టుకున్న వారిపై పోరాడినందుకు తాను జైలుకు వెళ్లానని ఆయన గుర్తుచేశారు.
Read More : బీసీల జనాభా తగ్గింపు వివాదం: కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

One thought on “వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆపలేరు: బండి సంజయ్”
Comments are closed.