కాంగ్రెస్ కులసర్వేలో బీసీల జనాభా తక్కువగా చూపించి, ఓసీల సంఖ్యను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గ్రామాలు, కులాల వారీగా జనాభా లెక్కలను రేవంత్ ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ, డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.
బీసీ హక్కుల పరిరక్షణపై బీఆర్ఎస్ పోరాటం
కామారెడ్డిలో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, బీసీల హక్కులను కాపాడే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు. బీసీలకు బలమైన నాయకత్వం అందించేందుకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ స్థాయిల్లో పదవులు ఇచ్చామని తెలిపారు. బీసీల సంక్షేమానికి గత పదేళ్లలో లక్షా 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్‌దని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హామీలు.. అమలు ఏదీ?
ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న హామీని కాంగ్రెస్ ఇంకా నెరవేర్చలేదని కవిత విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీ రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్, విద్యా మరియు ఉద్యోగ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీసీ వర్గాల సంక్షేమం – బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలు
బీజేపీ డబ్ల్యూఏస్ రిజర్వేషన్లు అమలు చేయడంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 54 శాతానికి చేరుకున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణలో బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Read More : మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. అసెంబ్లీకి గైర్హాజరు కావడంపై విమర్శలు..

One thought on “బీసీల జనాభా తగ్గింపు వివాదం: కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం”
Comments are closed.