పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ లవ్ అండ్ వార్ డ్రామా ‘పౌజీ’ రూపొందుతున్న విషయం తెలిసిందే. 1800 ఏళ్ల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో మధురమైన ప్రేమకథతో పాటు ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయి. ప్రభాస్‌కు జోడీగా అందాల తార ఇమ్మాన్వీని ఎంపిక చేశారు. లాంచింగ్ రోజే ఇమ్మాన్వీ తన అందం, డ్యాన్స్ ప్రతిభతో అందరి మనసులను గెలుచుకుంది. అటు స్క్రీన్‌పై కెమిస్ట్రీ కుదిరేలా, ఇటు యాక్షన్ సీన్స్‌లో సైతం మెరవడంలో ఇమ్మాన్వీకి మంచి టాలెంట్ ఉందని హను రాఘవపూడి భావించాడట.
అయితే, ఈ చిత్రంలో కీలకమైన సెకండ్ లీడ్ పాత్ర కోసం ఇప్పటికే మృణాల్ ఠాకూర్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. కానీ, ఆమె ఎంపికకు సంబంధించి డైరెక్టర్ హనుకు కొన్ని సందేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాత్రలో ప్రెష్ ఫీలింగ్ రావాలని భావిస్తున్న హను, మృణాల్‌కు బదులుగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని కూడా పరిశీలిస్తున్నాడట. దిశా పటానీ ‘కల్కి 2898’ చిత్రంలో కేవలం కొన్ని క్షణాలే కనిపించినప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. దిశా పాత్రకు సరైన హావభావాలతో పాటు యాక్షన్ సీన్స్‌లో పటుత్వం ఉండటం హనును ఆకర్షించిందని టాక్.
దీంతో, మృణాల్ ఠాకూర్, దిశా పటానీ మధ్య ‘పౌజీ’ సెకండ్ లీడ్ రోల్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ప్రభాస్‌తో నటించే అవకాశం రాని మృణాల్, ఈ గోల్డెన్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది. కానీ, ఇప్పుడా అవకాశం రావడం, చివరికి చేజారిపోవడం అన్నట్లుగా కనిపిస్తోంది. మరి, ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రభాస్ సరసన సెకండ్ లీడ్‌గా ఎవరు ఎంపికవుతారో చూడాలి!

One thought on “‘పౌజీ’ కోసం మృణాల్ – దిశా మధ్య పోటీ!”
Comments are closed.