బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చేస్తున్న ధర్నా నిజంగా బీసీల కోసం కాదని, ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బండి సంజయ్ విమర్శించారు. మైనార్టీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్‌ను అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని, బీసీ వర్గాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు 5 శాతం పెంచి, ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే బిల్లుకు మద్దతిస్తామని, లేకపోతే బిల్లును అడ్డుకుంటామని హెచ్చరించారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా బీసీని ప్రధాని చేశారా? ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం అయ్యాడా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ కేంద్రంపై నెపం మోపుతోందని విమర్శించారు. అలాగే బెంగాల్, బీహార్, యూపీ తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్ కనుమరుగైపోతుందని జోస్యం చెప్పారు.
Read More : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ డబుల్ గేమ్: విజయశాంతి

One thought on “కాంగ్రెస్ ధర్నా బీసీల కోసం కాదు ?”
Comments are closed.