సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ సభ్యుడు కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం కుంటయ్య పార్థివదేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ భావోద్వేగంతో మాట్లాడారు. “నాకు ఏసీబీ విచారణ జరుగుతుండగా కుంటయ్య వచ్చి ధైర్యం చెప్పాడు. కానీ ఏమైందో తెలియదు… రాత్రికి రాత్రే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం నాకు వ్యక్తిగతంగా తీవ్ర బాధ కలిగించింది” అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ కుటుంబానికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని, వారి ఇద్దరు పిల్లల విద్య, పెళ్లిళ్లు, భవిష్యత్తుకు అవసరమైన ప్రతీ విషయాన్నీ తాను చూసుకుంటానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కుంటయ్య మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని, ఆయన సేవలు మరువలేనివని కేటీఆర్ పేర్కొన్నారు.
Read More : బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..

One thought on “బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య మృతదేహానికి కేటీఆర్ నివాళి.”
Comments are closed.