వల్లభనేని వంశీ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థత

vamsi

గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో వంశీ కంకిపాడు పోలీస్‌ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం కస్టడీలో అకస్మాత్తుగా క్షీణించింది.

పోలీసులు పరిస్థితిని గమనించి వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తగిన చికిత్స అందిస్తున్నారు. వంశీ అస్వస్థతకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ ఆసుపత్రికి చేరుకుని వైద్యులను కలుసుకున్నారు. అలాగే, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నానీ కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

పేర్ని నాని మాట్లాడుతూ, వల్లభనేని వంశీకి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా, కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన సౌకర్యాలున్న ఎయిమ్స్ వంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

One thought on “వల్లభనేని వంశీ ఆసుపత్రిలో తీవ్ర అస్వస్థత

Comments are closed.